Madhu Gonugunta

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము॥
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలితల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము॥
కామిని పాపము కడిగిన పాదము
పాము తల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము॥
పరమయోగులకు పరిపరివిధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము॥
--------------------------------
భగవంతుడే పాదాలే మా పలుకులు లేదా పదాలు, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య పరిణామం, భగవంతుని అడుగులు అని సర్వులు గ్రహించగలరు
No comments:
Post a Comment