పడుండను తావులేక
కప్పుకోను దుప్పటిలేక
చలిని తట్టుకోలేక
చదువుకునోచుకోని పెదవులు
భిక్షపాటను పాడటం తెలియక
అనురాగాప్యాయతలు ఎరుగక
ఛీదరింపులకు నిలువలేక
పనిచేయను చేతకాక
ఆపన్నహస్తం కానరాక
ఎలా బతకాలో తోచక
చావడమూ తెలియక
గాజుకళ్ళలో కన్నీళ్ళు కారక
గ్రీష్మంలో ఎండలేక
వసంతం కరుణించక
కఠినమైన కాలం కదలక
భారమైన బతుకులో
అనాధకు అనాధే చేరువై
చెలిమి కలిమిలో మేలిమై
మురుగుతున్న బాల్యాలు !!!
--- సురేంద్రరొడ్డ
No comments:
Post a Comment