నేను తెలంగాణ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకి ని కాను. మంచి చేసినపుడు మెచ్చుకున్నాను అలాగని తప్పు చేస్తుంటే మాట్లాడకుండా ఉండలేము కదా...
1. మొట్టమొదట ఈరోజు వార్త...కేసీఆర్ గారి గురించి నెగటివ్ గా సోషల్ మీడియా లో మాట్లాడితే పోలీస్ నిఘా ఉంటుంది...అని. ఎందుకుండాలి? దేశ ప్రధానమంత్రి కూడా ఇటువంటి కండిషన్ పెట్టలేదు... విమర్శ ను కూడా స్వీకరిస్తున్నారు మరి మీరేంది సారూ ...మంచి చెడు రెండు వినే ధోరణి లో ఉండాలి గాని...ఇదేందీ...నాకు నచ్చిందే వింటా అని!?
2. తెలంగాణ JAC అందరికి తెలిసినదే. అపుడు Prof. కోదండరాం కావాల్సిన మనిషి. ఇపుడు అక్కర్లేదు..అందుకని రాత్రి కి రాత్రి పెద్దాయన ను ఇలాగా హేండిల్ చెయ్యటం?
మన విధానాలు బాగున్నాయి...లోటుపాట్లు ఉంటె సర్దుకోవాలి. విపక్షాలైన, ప్రజాలైనా.. కష్టం ఉంటె వేలు ఎత్తి చూపాలి..
చూపుతారు కూడా. అందర్నీ ఇలా నోరుమూయించాల్సిన అవసరం ఎంటో నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఇది సరైన పద్ధతి మాత్రం కాదు అని చెప్పగలను.

3. కొద్ది సేపు ఆయన స్వార్థపరుడు అనుకుందాం..అసలు ఏం చెప్తాడో వినాలి కదా...వినకుండానే ఇలా నిర్బంధించటం ఎంతవరకు సబబు? పీడీ ఆక్ట్ ఇక్కడ వర్తింపచేస్తున్నారు సరే...మరి ఆయనకు రెప్రెసెన్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారా...లేదు...ఎందుకని?
నేను రేపు కనపడకపోతే మిత్రులారా గమనించుకోగలరు ఎవర్ని నిలదీయాలో!
No comments:
Post a Comment