అన్నమాచార్య సంకీర్తన
కంభమున వెడలి ఘననరసింహము
కుంభిని హిరణ్యు గూలిచెను॥
కుంభిని హిరణ్యు గూలిచెను॥
తొడికి దైత్యుదనతొడపైకి దిగిచి
కడుపుచించి రక్తము చల్లి
జడియక పేగులు జందెంబులుగా
మెడ దగిలించుక మెరసీ వాడే॥
కడుపుచించి రక్తము చల్లి
జడియక పేగులు జందెంబులుగా
మెడ దగిలించుక మెరసీ వాడే॥
పెదవులు చింపుచు పెనుగోళ్ళ నదిమి
వుదుటుబునుక గొరి కుమియుచును
సదరపుగుండెలు చప్పరించుచును
మెదడు గందముగ మెత్తీవాడే॥
వుదుటుబునుక గొరి కుమియుచును
సదరపుగుండెలు చప్పరించుచును
మెదడు గందముగ మెత్తీవాడే॥
దేవతలభయము దీర్చి యంకమున
శ్రీవనితను కృపసేయుచును
పావనపుటహోబలగిరి దైవము
శ్రీవేంకటగిరి జెలగీవాడే
శ్రీవనితను కృపసేయుచును
పావనపుటహోబలగిరి దైవము
శ్రీవేంకటగిరి జెలగీవాడే
No comments:
Post a Comment